ఒక స్కూల్‌లో విద్యార్థుల మధ్య ఫైట్ జరుగగా.. ఈ ఘర్షణలో ఒక విద్యార్థి మరణించాడు. దర్యాప్తు చేసిన పోలీసులు ఒక విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉదయం ఢిల్లీలోని చిన్మయ విద్యాలయంలో మార్నింగ్ ప్రేయర్ తర్వాత ఆరో తరగతి చదువుతున్న విద్యార్థులు స్వల్పంగా కొట్టుకున్నారు. ఈ సంఘటనలో 12 ఏళ్ల ప్రిన్స్ అస్వస్థతకు గురై మరణించాడు. ఆ బాలుడికి మూర్ఛ సంబంధిత సమస్య ఉండవచ్చని వైద్యులు అనుమానిస్తున్నారు.