మేడారం జాతరకు అచ్చంపేట ఆర్టీసీ బస్సులు
మేడారం మహా జాతరకు అచ్చంపేట ఆర్టీసీ డిపో నుండి 37 బస్సులను పంపించినట్లు ఆర్టీసీ డిఎం మురళీ దుర్గాప్రసాద్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. అచ్చంపేట ఆర్టీసీ డిపో పరిధిలో ఆ రూట్లలో బస్సుల సంఖ్యను తగ్గించామని ప్రయాణికులు, ప్రజలు సహకరించాలని కోరారు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా బస్సులు నడిపిస్తున్నామని వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని తెలిపారు. ఈనెల 26 తర్వాత యధావిధిగా ఆయా రూట్లలో బస్సులు నడుపుతామని తెలిపారు.