విద్యార్థులకు ఈ బాల్యం నుండే బాధ్యతలు, గౌరవాన్ని సహజమైన అలవాటుగా మార్చాలని ఆ దిశగా ఇటు ఉపాధ్యాయులు అటు తల్లిదండ్రులు ప్రయత్నం చేయాలని పాఠశాల హెడ్మాస్టర్ భారతి, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ మణెమ్మ సూచించారు. శనివారం నారాయణపేట మండలం జాజాపూర్ ఉన్నత పాఠశాలలో జరిగిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశంలో వారు మాట్లాడుతూ. చదువుతో పాటు పిల్లల్లో మంచి గుణాలు అలవాటు చేస్తే ఉత్తమ సమాజ నిర్మాణం జరుగుతుందన్నారు.