షాకింగ్: పురుషులకూ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు
బ్రెస్ట్ క్యాన్సర్ మహమ్మారి స్త్రీలకు మాత్రమే వస్తుందని చాలామంది భావిస్తారు. కానీ పురుషుల్లోనూ వస్తుందని ఆంకాలజిస్ట్ డాక్టర్ సీఎన్ పాటిల్ తెలిపారు. 'అరుదే అయినా వచ్చే ప్రమాదం లేకపోలేదు. హార్మోన్ల అసమతుల్యత, జన్యు పరమైన కారణాలు, పర్యావరణం దీనికి కారణం కావొచ్చు. 60 నుంచి 70 ఏళ్ల మధ్యలో ఉన్న పురుషులకు రిస్క్ ఎక్కువ. ఛాతీలో గడ్డ కనిపిస్తే వెంటనే పరీక్షించుకోవడం ఉత్తమం' అని వివరించారు.