శుభ్‌మన్ గిల్‌తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన నటి
భారత స్టార్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ హిందీ నటి రిధిమా పండిట్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు షికార్లు చేస్తున్నాయి. అంతేకాదు రిధిమా పండిట్‌కు సోషల్ మీడియా వేదికగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, ఈ పెళ్లి పుకార్లపై రిధిమా పండిట్ స్పందించారు. తానెప్పుడూ జీవితంలో శుభ్‌మన్ గిల్‌ను నేరుగా చూడలేదన్నారు. తమ వివాహంపై వస్తున్న వార్తలన్నీ పుకార్లేనని కొట్టిపారేశారు. తనకు అభినందనలు రావడం మాత్రం వాస్తవమేనని చెప్పుకొచ్చారు.