కజకిస్థాన్ విమాన ప్రమాదం.. 38కి చేరిన మృతుల సంఖ్య
కజకిస్థాన్‌లోని ఆక్టౌసిటీ సమీపంలో బుధవారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య 38కి చేరింది. ఈ మేరకు అధికారులు అధికారికంగా వెల్లడించారు. అజర్ బైజాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం బాకు నుంచి రష్యాలోని గ్రోజ్నీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో విమానంలో ఐదుగురు సిబ్బంది సహా మొత్తం 67 మంది ఉన్నారు.