సంధ్య థియేటర్ ఘటన.. శ్రీతేజ్ హెల్త్ బులెటిన్ విడుదల
హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద 'పుష్ప-2' ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో గాయపడ్డ బాలుడు శ్రీతేజ్(9) హెల్త్ బులెటిన్‌ను కిమ్స్ ఆస్పత్రి వైద్యులు విడుదల చేశారు. శ్రీతేజ్ ఆరోగ్యం విషమంగానే ఉందని.. అతడు ఐసీయూలో వెంటిలేటర్ పైనే ఉన్నాడని, జ్వరం పెరుగుతోందని తెలిపారు. మెదడుకు ఆక్సిజన్ సరిగా అందట్లేదని, బాలుడిని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం ట్యూబ్ ద్వారా ఆహారం అందిస్తున్నామన్నారు.