BREAKING: కేటీఆర్‌కు హైకోర్టు నోటీసులు

52చూసినవారు
BREAKING: కేటీఆర్‌కు హైకోర్టు నోటీసులు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నామినేషన్‌ సందర్భంగా కేటీఆర్‌ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లలో తప్పుడు సమాచారం ఉందని కాంగ్రెస్‌ నేత కేకే మహేందర్‌రెడ్డి, లగిశెట్టి శ్రీనివాసులు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు న్యాయమూర్తి 4 వారాల్లో కౌంటరు దాఖలు చేయాలని కేటీఆర్‌తో పాటు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి, సిరిసిల్ల రిటర్నింగ్‌ అధికారికి నోటీసులు జారీ చేశారు.
Job Suitcase

Jobs near you