BREAKING: 9 నెలల చిన్నారికి హెచ్ఎంపీవీ వైరస్
దేశంలో మరో HMPV కేసు వెలుగు చూసింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో తొమ్మిది నెలల చిన్నారికి 'HMPV' పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో HMPV కేసుల సంఖ్య నాలుగుకు చేరుకుంది. జనవరి 6న జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో చిన్నారి ఇబ్బందిపడటంతో తల్లిదండ్రులు విహా చిల్డ్రన్స్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. చిన్నారికి జలుబు, దగ్గు తగ్గకపోవడంతో అనంతరం వైద్య పరీక్షలు చేయగా HMPV ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు.