AP: కులం, మతం పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తోందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. శనివారం ఏపీసీసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. ‘దేశం మొత్తాన్ని కాషాయ మయం చేసే కుట్రలు జరుగుతున్నాయి. కులం, మతం పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తోంది. మహాత్మాగాంధీని బీజేపీ విలన్‌గా చిత్రీకరించింది. అంబేద్కర్‌పై అసత్య ప్రచారాలు చేస్తోంది. మహాత్ములను అవమానించిన బీజేపీ క్షమాపణ చెప్పాలి.’ అని అన్నారు.