
నటుడు సప్తగిరి తల్లి కన్నుమూత
టాలీవుడ్ ప్రముఖ నటుడు సప్తగిరి ఇంట్లో విషాదం నెలకొంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తల్లి చిట్టెమ్మ మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని సప్తగిరి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దీంతో టాలీవుడ్ నటీనటులు సంతాపం తెలుపుతున్నారు. ఇక ఇవాళ తిరుపతిలో చిట్టెమ్మ అంత్యక్రియలు జరగనున్నాయి.