పండుగ రద్దీ వేళ ట్రావెల్స్ అడ్డగోలు దోపిడీ
పట్టణం పల్లెబాట పట్టింది. ఉపాధి ఉద్యోగాల కోసం హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల నుంచి స్వస్థలాలకు వెళ్తున్నారు. ఇదే అదనుగా చేసుకుని ప్రైవేట్ ట్రావెల్స్ వారు అడ్డగోలు దోపిడీకి తెరలేపారు. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ట్రావెల్స్ బస్సుల్లో టికెట్ ధర రూ.500 నుంచి రూ.2000 వరకు ఉండేది. ఇప్పుడు ఏకంగా తక్కువలో తక్కువ రూ.1000 నుంచి రూ.6 వేలకు పైగా వసూలు చేసి సామాన్యుల నడ్డి విరుస్తున్నారు.