తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం సంక్రాంతి హాలిడేస్ ఇచ్చేసింది. పాఠశాలకు శనివారం నుంచి జనవరి 17 వరకు, కాలేజీలకు 16 వరకు సెలవులు ఉన్నాయి. అయితే పండుగకు స్కూళ్లు, కాలేజీల యాజమాన్యాలు తప్పనిసరిగా సెలవులు ఇవ్వాలని విద్యాశాఖ హెచ్చరించింది. అందుకు విరుద్ధంగా విద్యాసంస్థలు నడిపితే గుర్తింపు రద్దు చేస్తామని తేల్చి చెప్పింది. అటు ఏపీలో జనవరి 10 నుంచి 19 వరకు ప్రభుత్వం స్కూళ్లకు హాలిడేస్ ప్రకటించిన విషయం తెలిసిందే.