బ్రౌన్ రైస్ తింటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది: నిపుణులు
వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ తింటే ఆరోగ్యానికి చాలా లాభాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. బ్రౌన్ రైస్‌లో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు వంటి శరీరానికి అవసరమైన పోషకాలు మెండుగా ఉంటాయి. ఈ రైస్‌ను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. కాబట్టి, షుగర్ ఉన్నవారు వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ తినొచ్చు. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బరువును అదుపులో ఉంచుతుంది. ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.