మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్నిప్రమాదం

67చూసినవారు
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికులు వివరాలు ప్రకారం మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని జాతీయ రహదారి పక్కన క్లాసిక్ డాబా వద్ద ఉన్న పోలిక్యాబ్ శానిటేషన్ ఎలక్ట్రికల్ షాప్ లో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది ఒక ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. సుమారుగా కోటి కి పైగా ఆస్తి నష్టం ఉంటుందని షాప్ యజమాని తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you