
మేడ్చల్: మల్లన్న కళ్యాణ మహోత్సవం
మేడ్చల్ నియోజకవర్గం మేడ్చల్ మండలం పూడూర్ గ్రామ పరిధిలోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో సోమవారం జరిగిన మల్లన్న కల్యాణ మహోత్సవ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మల్లారెడ్డి సతీసమేతంగా పాల్గొనడం జరిగింది. అలాగే 16లక్షల నిధులతో నిర్మాణం చేపట్టిన యాదవ సంఘం కమ్యూనిటీ హల్ ను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు మరియు రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు.