నెలకు రూ.1500 అంటూ ప్రచారం.. పోస్టాఫీసుల వద్ద మహిళల రద్దీ
ఏపీలో మహిళలు పోస్టాఫీసుల వద్ద పోటెత్తుతున్నారు. ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 అందాలంటే పోస్టాఫీసుల్లో అకౌంట్ తెరవాలని, ఇప్పటికే బ్యాంక్ ఖాతా ఉన్న వారు ఆధార్, ఎన్పీసీఐతో లింక్ చేసుకోవాలని కొందరు ప్రచారం చేస్తున్నారు. దాంతో మహిళలు పెద్ద సంఖ్యలో పోస్టాఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే ప్రభుత్వం దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. దీనిపై స్పష్టత ఇవ్వాలని పలువురు కోరుతున్నారు.