ఈ పథకంలో మహిళలకు రూ.50 వేలు
అన్నపూర్ణ యోజన స్కీమ్ ద్వారా మహిళలకు కేంద్ర ప్రభుత్వం రూ.50 వేల లోన్ అందిస్తోంది. ఫుడ్ కేటరింగ్ బిజినెస్ ప్రారంభించే ఔత్సాహిక మహిళలు ఈ పథకం ద్వారా లోన్ పొందొచ్చు. ఆ లోన్ మొత్తంతో వంట సామగ్రి, ఫ్రిజ్, గ్యాస్ కనెక్షన్, డైనింగ్ టేబుల్స్ కొనుగోలు చేయొచ్చు. 18-60 ఏళ్లలోపు మహిళలు అర్హులు. మూడేళ్లలోపు ఈ లోన్ చెల్లించాలి. ప్రభుత్వ రంగ బ్యాంకులను సంప్రదించి మహిళలు ఈ లోన్ పొందొచ్చు.