
శివరాత్రి రోజున ఉచిత క్యూలైన్ల ఏర్పాటు
AP: శివరాత్రి సందర్భంగా ఈ నెల 26న రోజంతా ఉచిత క్యూలైన్లు కొనసాగించి భక్తులు దర్శనాలు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని దేవాదాయ కమిషనర్ కె.రామచంద్రమోహన్ అధికారులను ఆదేశించారు. అంతరాలయ దర్శనాలకు అనుమతించకపోతే వేగంగా క్యూలైన్లు ముందుకు కదులుతాయని అన్నారు. శివరాత్రి రోజున ప్రముఖమైన శైవాలయాల్లో ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.