మహిళ పేరు మీదుగా ఇందిరమ్మ ఇండ్లు: పొంగులేటి
ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించారు. 'కాంగ్రెస్ అంటే ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లకు కాంగ్రెస్ పేటెంట్. రాష్ట్రంలో ఏ గ్రామానికి పోయినా, ఏ తండాకు పోయినా ఇందిరమ్మ ఇళ్ళే కనబడతాయి. అన్ని కార్యక్రమాలు ఒక వంతు.. మేం కట్టించే ఇందిరమ్మ ఇళ్లు మరో వంతు. ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించి ఇస్తాం. మహిళ పేరు మీద ఇండ్లు మంజూరు చేస్తాం' అని అన్నారు.