Top 10 viral news 🔥
నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్
తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరికి ఈ నెల 29 వరకు కోర్టు రిమాండ్ విధించింది. చెన్నైలోని ఎగ్మోర్ కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో ఆమెను పుఝల్ సెంట్రల్ జైలుకు తరలించారు. తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు చెన్నై పోలీసులు ఆమెను హైదరాబాద్లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.