AP: జగన్ హయాంలో పంచాయతీలు నిర్వీర్యం అయ్యాయని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. సర్పంచులు భిక్షమెత్తేలా చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం పంచాయతీల ఆర్థిక పరిపుష్టిని పెంచిందని, సర్పంచ్లు గౌరవంగా తలెత్తుకునేలా చేసిందన్నారు. ఆదివారం పాలకొల్లు నియోజకవర్గంలో పలువురు సర్పంచ్లు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి నిమ్మల పాల్గొని మాట్లాడారు.