జగన్, అదానీ ముడుపుల వ్యవహారంపై చర్చిస్తాం: పవన్
గత ప్రభుత్వ తప్పులు రాష్ట్రానికి శాపాలుగా మారాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. వాటిని ఇప్పుడు తాము సరిదిద్దాల్సి వస్తోందన్నారు. మాజీ సీఎం జగన్, అదానీ ముడుపుల వ్యవహారంపై సీఎం చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. బాధ్యత లేకుండా గత ప్రభుత్వం వ్యహరించిందని, కేవలం సమోసాల కోసమే రూ.9 కోట్లు ఖర్చు చేసిందని విమర్శించారు.