మైదానంలో కుప్పకూలి క్రికెటర్ మృతి (వీడియో)
మ్యాచ్ ఆడుతూ యువ క్రికెటర్ ఇమ్రాన్ పటేల్ (35) గుండెపోటుతో చనిపోయాడు. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్లో చోటు చేసుకుంది. గార్వేర్ స్టేడియంలో లీగ్ మ్యాచులో ఓపెనింగ్ బ్యాటింగ్‌కు వచ్చిన ఇమ్రాన్.. గుండె దగ్గర, ఎడమ చేతిలో నొప్పి ఉందని అంపైర్లకు చెప్పాడు. పెవిలియన్‌కు వెళ్తూ కుప్పకూలాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా.. చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇమ్రాన్‌కు భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.