టాలీవుడ్ ప్రొడ్యూసర్ శివరామకృష్ణ మళ్ళీ అరెస్ట్
టాలీవుడ్ ప్రొడ్యూసర్ శివరామకృష్ణ మళ్ళీ అరెస్ట్ అయ్యారు. 4 రోజుల క్రితం శివరామకృష్ణను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించగా, అనారోగ్య కారణాలతో బెయిల్ పొందారు. దీంతో శివరామకృష్ణ బెయిల్ రద్దు చేయాలని పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు బెయిల్ రద్దు చేయడంతో గురువారం ఆయనను పోలీసులు మళ్ళీ అరెస్ట్ చేశారు. కాగా, HYD-రాయదుర్గంలోని 84 ఎకరాల ప్రభుత్వ భూమిని శివరామకృష్ణ కొట్టేసే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే.