హైదరాబాద్‌లో చెట్లను నరికితే భారీగా జరిమానా

72చూసినవారు
హైదరాబాద్‌లో చెట్లను నరికితే భారీగా జరిమానా
TG: హైదరాబాద్‌లో ఉన్న ప్రతి చెట్టును కాపాడేందుకు అటవీశాఖ వాల్టా చట్టాన్ని కఠినతరం చేస్తోంది. ఎవరైనా పార్కులో మొక్కలను తీసివేసిన, ఇంట్లో చెట్టు కొమ్మలను నరికినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. ఒకవేళ నిబంధనలను ఉల్లంఘించితే భారీగా జరిమానాలు విధిస్తామని వెల్లడించింది. వాల్టా చట్టం ప్రకారం తమ ఇంటి ఆవరణలోని చెట్టును ఎవరూ స్వయంగా నరికివేయకూడదు. వాటి వల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి.
Job Suitcase

Jobs near you