'కొండపోచమ్మ సాగర్' ఘటన.. గల్లంతైన ఐదుగురి మృతదేహాలు లభ్యం
సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ సాగర్లో గల్లంతైన ఐదుగురు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతి చెందిన ఐదుగురు యువకులు మృతదేహాలను అధికారులు వెలికితీశారు. సుమారు 6 గంటల పాటు గాలింపు కొనసాగింది. దినేష్, ధనుష్, జతిన్, లోహిత్, సాహిల్ మృతిచెందగా.. మృగాంక్, ఇబ్రహీం ప్రమాదం నుంచి బయటపడ్డారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.