టూరిస్ట్ బోటు బోల్తా.. ఒకరి మృతి (వీడియో)
ముంబైలో ఫెర్రీ బోటు ప్రమాదం మరువక ముందే గోవాలో మరో ప్రమాదం జరిగింది. కలాంగుట్ బీచ్లో టూరిస్ట్ బోటు బోల్తా పడింది.ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. మరో 20 మందిని రక్షించినట్లు సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు. తీరప్రాంతానికి 60 మీటర్ల దూరంలో పడవ బోల్తా పడిందని, గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు తెలిపారు.