సినీ పెద్దలతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. అనంతరం ఎఫ్‌డీసీ చైర్మన్, నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. 'తెలుగు సినిమా ఇండస్ట్రీని ప్రపంచస్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం. HYDను ఇంటర్నేషనల్ సినీ హబ్ గా మార్చాలని సీఎం సూచించారు. టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోలు చిన్న విషయం. ప్రభుత్వం అడిగిన అంశాలపై 15 రోజుల్లో నివేదిక ఇస్తాం. మరోసారి సీఎంతో భేటీ అవుతాము' అని అన్నారు.