జమ్మికుంటలో... గులాబీ దళపతి కేసీఆర్ రోడ్ షో
గులాబీ దళపతి కేసీఆర్ గురువారం జమ్మికుంట కు రానున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర మాజీ సీఎం కేసీఆర్ ప్రారంభించిన విషయం తెలిసిందే. జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద గురువారం సాయంత్రం 6 గంటలకు కేసీఆర్ రోడ్ షో జరగనుంది. రోడ్ షో అనంతరం కేసీఆర్ వీణవంకలోని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంట్లో బస చేస్తారు. రోడ్ షో ను పురస్కరించుకొని జమ్మికుంటలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.