జానీ మాస్టర్ కేసు.. తీర్పు రేపటికి వాయిదా!
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కస్టడీ పిటిషన్పై రంగారెడ్డి కోర్టులో వాదనలు పూర్తి అయ్యాయి. అనంతరం కోర్టు కస్టడీ పిటిషన్పై తీర్పును రేపటికి వాయిదా వేసింది. దీంతో బెయిల్ పిటిషన్పై కూడా బుధవారం వాదనలు జరగనున్నాయి. ప్రస్తుతం చర్లపల్లి జైలులో జానీ మాస్టర్ రిమాండ్ ఖైదీగా ఉన్నారు.