మాటలకందని విషాదం.. కలిచివేసే దృశ్యాలు (VIDEO)
యూపీ ఝాన్సీలోని మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదం కారణంగా 10 మంది పసికందులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. శిశువులు సజీవ దహనమైన ఘటన మనసును కలిచివేస్తోంది. కాలిపోయిన పసిపిల్లల మృతదేహాలను ఆస్పత్రి నుంచి కొందరు చేతులతో బయటికి తీసుకెళ్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో ఆస్పత్రి వద్ద పిల్లల తల్లిదండ్రులు, బంధువులతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.