AP: సినీ నటి శ్రీరెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డికి మరో షాక్ తగిలింది. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు చేసిన శ్రీరెడ్డి, అందుకు కారకులైన సజ్జల భార్గవ్ రెడ్డి, యశ్వంత్, వర్రా రవీందర్ రెడ్డిలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పల్నాడు డీసీసీ అధ్యక్షుడు అలెగ్జాండర్ సుధాకర్ నరసరావుపేట ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఫిర్యాదు చేశారు.