Top 10 viral news 🔥
స్కూళ్లకు ప్రభుత్వం కీలక ఆదేశాలు
AP: స్కూళ్లకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. పాఠశాల ఆవరణాల్లో వివాహాలు, రాజకీయ, మతపరమైన సమావేశాలు నిర్వహించరాదని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాలల పనివేళలకు ముందు, తర్వాత, సెలవుల్లో ఇలాంటి కార్యక్రమాలకు డీఈవోలు, హెచ్ఎంలు, ఆర్జేడీలు అనుమతిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. ఇకపై ఎలాంటి కార్యక్రమాలకు అనుమతి ఇవ్వొద్దని విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది.