డబ్బుల కోసం.. ఇంటికి తాళం వేసిన ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులు
TG: జగిత్యాల జిల్లాలో అమానుషమైన ఘటన చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని కటికవాడకు చెందిన మియాల్కర్ రవి 2018లో ఓ ప్రైవేట్ పైనాన్స్లో రూ. 4 లక్షల అప్పు తీసుకున్నాడు. ఇప్పటికే రూ. 7 లక్షలు చెల్లించగా.. ఇంకో రూ. లక్ష కట్టాలంటూ శనివారం రాత్రి రవి ఇంటికి ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులు తాళం వేశారు. దీంతో చిన్న పిల్లాడితో సహా రాత్రి పూట రవి కుటుంబ సభ్యులు చలిలో గడిపారు.