యూపీలో ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. ఒరాయ్‌లోని కొత్వాలి ప్రాంతానికి చెందిన ఓ వివాహిత తన కూతురు పెళ్లికి చేయించిన రూ. 2.50 లక్షల విలువైన నగలు, రూ. 40 వేలు తీసుకొని వేరే వ్యక్తితో పారిపోయింది. దీని వల్ల కూతురి సంబంధం విచ్చిన్నం అయ్యేలా ఉందని బాధితుడు పీఎస్‌ను ఆశ్రయించాడు. ఇంకా తన భార్యను తీసుకెళ్లిన వ్యక్తి.. ఫోన్ చేసి తన భార్యను అమ్మేస్తానని బెదిరిస్తున్నాడని, ఆమెను క్షేమంగా తీసుకురావాలని కోరాడు. ఆ వ్యక్తిని కఠినంగా శిక్షించాలని పేర్కొన్నాడు.