స్కూల్ ఫీజు కట్టలేదని విద్యార్థులను ఇంటికి పంపించేసిన యాజమాన్యం (వీడియో)
TG: హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. లాల్ దర్వాజాలోని శ్రీసాయి గ్రామర్ హైస్కూల్‌కు చెందిన 12 మంది విద్యార్థులు స్కూల్ ఫీజు కట్టలేదని.. స్కూల్ యాజమాన్యం సదరు విద్యార్థులను ఇంటికి పంపించేసింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదనకు గురై.. తక్షణమే అధికారులు స్పందించి స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.