TG: ఖమ్మం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కూసుమంచి మండలం గొళ్లపల్లి గ్రామానికి చెందిన ఉపేందర్ అనే వ్యక్తి కూరగాయల వ్యాపారం చేసుకునేవాడు. అతడు గత కొన్ని నెలలుగా ఆన్‌లైన్ బెట్టింగ్‌లో పెట్టుబడులు పెడుతూ.. వాటికి బానిసయ్యాడు. ఈ క్రమంలో అధిక వడ్డీకి సుమారు రూ. 6 లక్షల వరకు అప్పు తెచ్చి.. అవి తీర్చలేకపోయాడు. దీంతో మనస్థాపానికి గురై ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.