గజ్జల ఉమాశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్పై తీర్పు వాయిదా
వివేకా హత్య కేసులో ఏ3 నిందితుడిగా ఉన్న ఉమాశంకర్ రెడ్డి బెయిల్ మంజూరు చేయాలని దాఖలు చేసిన పిటిషన్ పై తీర్పును TG హైకోర్టు వాయిదా వేసింది. ఉమాశంకర్ ను ప్రత్యక్షసాక్షి గుర్తించలేదని ఆయన తరఫు న్యాయవాది తెలిపారు. పొడవుగా, నల్లగా ఉన్నాడని చెప్పిన మాటల ఆధారంగా నిందితుడిగా చేర్చారని కోర్టుకు తెలిపారు. సీసీ కెమెరాలో దృశ్యాల ఆధారంగానే ఉమాశంకర్ ను గుర్తించామని సీబీఐ న్యాయవాది తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి లక్ష్మణ్ తీర్పు వాయిదా వేశారు.