హరీశ్ రావుకు మంత్రి సీతక్క కౌంటర్
TG: బతుకమ్మ చీరల విషయంలో మాజీ మంత్రి హరీష్ రావుకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం చీరలను బంద్ పెట్టిందంటూ హరీష్ రావు మాట్లాడారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాసి రకం చీరలిచ్చి మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచారని అన్నారు. తమ ప్రజా ప్రభుత్వంలో బతుకమ్మ చీరలకు మించిన ఆర్దిక ప్రయోజనాలను మహిళలకు అందిస్తున్నామని పేర్కొన్నారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తున్నామని వెల్లడించారు.