సల్మాన్‌ఖాన్‌ను చంపేస్తామని మరోసారి బెదిరింపులు
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు తాజాగా మరోసారి బెదిరింపులు వచ్చాయి. కృష్ణ జింకను చంపినందుకు గానూ సల్మాన్ ఆలయాన్ని సందర్శించి క్షమాపణలు చెప్పాలని.. లేదంటే రూ.5 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు లారెన్స్ బిష్ణోయ్ సోదరుడిగా చెప్పుకునే వ్యక్తి నుంచి ముంబై పోలీస్ ట్రాఫిక్ కంట్రోల్ యూనిట్‌కు సోమవారం మెసేజ్ వచ్చినట్లు తాజాగా వెల్లడించారు.