ఏపీలోని ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాలోలాగా క్రైమ్ జరిగింది. నెల్లూరులో ఓ మహిళను హత్య చేసిన తండ్రీకూతురు మృతదేహాన్ని సూట్‌కేస్‌లో కుక్కి రైలులో చెన్నై తీసుకెళ్లారు. మీంజూర్ రైల్వే స్టేషన్ దగ్గర సూట్‌కేస్ విసిరేస్తుండగా ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మహేశ్ వారిని పట్టుకున్నారు. సూట్‌కేస్ తెరిచి చూడగా అందులో మహిళ మృతదేహం ఉంది. నిందితులు తండ్రి సుబ్రహ్మణ్యం, కూతురు దివ్యశ్రీగా గుర్తించారు. దర్యాప్తు జరుగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.