చెన్నై ఎయిర్ పోర్టు తాత్కాలికంగా మూసివేత
చెన్నై ఎయిర్ పోర్టును తాత్కాలికంగా మూసివేశారు. ఫెంగల్ తుఫాన్ నేపథ్యంలో చెన్నై వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తుండడంతో ఇప్పటికే పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. తాజాగా చెన్నై ఎయిర్ పోర్టును తాత్కాలికంగా మూసివేశారు. రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో ముందు జాగ్రత్తగా ఎయిర్ పోర్టును మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.