భారీ ఎన్ కౌంటర్.. 20కి చేరిన మృతుల సంఖ్య
ఛత్తీస్గఢ్- ఒడిశా సరిహద్దులో జరిగిన భారీ ఎన్కౌంటర్ లో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 20 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. మృతుల్లో చిత్తూరు జిల్లాకు చెందిన చలపతి, కేంద్ర కమిటీ సభ్యులు మనోజ్, గుడ్డూ తదితరులు ఉన్నారు. మృతుల్లో ఇద్దరు మహిళలున్నట్లు సమాచారం. కాగా ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దుల్లో భద్రతా బలగాలు కూంబింగ్ కొనసాగిస్తున్నాయి.