గ్యాస్ సిలిండర్ పేలి ఒకరు స్పాట్ డెడ్ (వీడియో)
TG: నారాయణపేట జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. మద్దూరు మండల కేంద్రంలో హెచ్పీ గ్యాస్ గోదాంలో ఆకస్మాత్తుగా గ్యాస్ సిలిండర్ పేలడంతో నరేష్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.