ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల భవన నిర్మాణానికి చర్యలు

54చూసినవారు
ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల భవన నిర్మాణానికి చర్యలు
ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల భవన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి. పి. గౌతమ్ అన్నారు. మంగళవారం కలెక్టర్, స్థానిక రమణగుట్ట రజక వీధి ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల సందర్శించారు. అద్దె ఇంట్లో వసతుల లేమితో నిర్వహిస్తున్న పాఠశాలకు వెంటనే స్థల గుర్తింపు చేసి, భవన నిర్మాణానికి చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you