మణుగూరులో సంపూర్ణ స్వచ్ఛత వారోత్సవ ర్యాలీ
ప్రభుత్వ ఐటిఐ విద్యార్థులు బుధవారం ముత్యాలమ్మనగర్ లో సంపూర్ణ స్వచ్ఛత వారోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఐటిఐ ప్రిన్సిపాల్ బి ప్రభాకర్ ప్రారంభించి ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంపూర్ణ స్వచ్ఛత వారోత్సవాల్లో భాగంగా ఈ వారం రోజులపాటు ఐటిఐలో పలు పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించామన్నారు.