సత్తుపల్లి: సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు విఫలం

83చూసినవారు
సత్తుపల్లి: సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు విఫలం
ప్రజా సమస్యలు పరిష్కరించటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఎం డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణరెడ్డి విమర్శించారు. సత్తుపల్లిలో బుధవారం జరిగిన సమావేశంలో మాట్లాడారు. ప్రజా రవాణా కోసం రైల్వేలైన్ ప్రారంభించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేపట్టాలని కోరారు. పండిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్