Top 10 viral news 🔥

మహారాష్ట్రలో వింత వ్యాధి.. ఆందోళనలో ప్రజలు
మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లాలోని షెగావ్లో వింత వ్యాధి కలకలం రేపుతోంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. జుట్టు ఊడిపోయి, చేతి గోళ్లు రాలిపోతున్నాయి. కానీ దానికి కారణం మాత్రం తెలియట్లేదు. విషయం తెలుసుకున్న ICMR నిపుణుల బృందం బుల్ధానాకు చేరుకుని ప్రజలకు పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజల జుట్టు, గోళ్లు, ఇతర నమూనాలు సేకరించారు. అయితే ఇప్పటికే 30 మందికి జుట్టు, గోళ్లు రాలిపోయినట్లు వెల్లడించింది.