మహిళ గర్భంలో 18 మంది పిల్లలని ప్రచారం.. కానీ (వీడియో)
తల్లి అవ్వడం అనేది ఏ స్త్రీకైనా చాలా ఆహ్లాదకరమైన అనుభూతి. అయితే కొంత మంది మహిళల గర్భం విషయంలో కలలో కూడా ఊహించని విధంగా సంఘటనలు జరుగుతాయి. ఇలాంటి కథే ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అమెరికాలోని టెక్సాస్ నివాసి అయిన ఓ స్త్రీ 18 మంది పిల్లలకు జన్మనివ్వబోతోందని ప్రచారం జరుగుతోంది. అయితే, ఆమె గర్భవతి కాదని ఆమెకు భారీ కణితి ఉందని పక్కనే ఉన్న వ్యక్తి వ్యాఖ్యానించాడు.